హైకోర్టులో ఎమ్మెల్యే దానంకు ఎదురుదెబ్బ
18-09-2026 | 04:30pm
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు అంశంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుపడుతూ ఆయనపై దానంపై అనర్హత వేటు వేస్తూ తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి హైకోర్టు తెలిపింది. దానంపై అనర్హతవేటు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.