పిఆర్ టి యు మండల శాఖ అధ్యక్షుని ఏకగ్రీవం...
వెంకటాపురం, నూగూరు సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) వెంకటాపురం మండలంలో పి ఆర్ టి యు కార్యవర్గ సమావేశంలో(PRTU Venkatapuram Mandal committee) మండల శాఖ అధ్యక్షునిగా బి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కె వీరన్న లను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో అసోసియేట్ అధ్యక్షులుగా ఎం సత్యనారాయణ, ఐ మాధవరావు, మహిళ అసోసియేట్ అధ్యక్షులుగా బి విజయ, జె సుజాత, ఉపాధ్యక్షులుగా కె విజయ్, ఏడుకొండలస్వామి, మహిళా ఉపాధ్యక్షులుగా టి వెంకటరమణ, జె.కళ్యాణి కార్యదర్శులుగా ఐ రాజేశ్వరరావు, ఎల్ రమేషు మహిళా కార్యదర్శిగా సిహెచ్. షర్మిల ని ఏకగ్రీవంగా ఎన్నుకొనుట జరిగినది.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు యాకూబ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీరంగం, జిల్లా మాజీ అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ ఎన్నికల నిర్వహణ గాను వెంకటేశ్వర్లు హాజరు అయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సమస్యల పైన జిల్లా అధ్యక్షులు యాకూబ్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించి 50 శాతం తగ్గకుండా అమలు చేయాలని, సి పి ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, 317 జీవో ద్వారా వచ్చిన ఉపాధ్యాయులలో 190 జీవోను వెంటనే అమలు చేయాలని ప్రాథమిక పాఠశాలలో 19 లోపు ఉన్న విద్యార్థులలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.