ప్రయాణికుల వెయిటింగ్‌.. వాహనదారుల రేసింగ్‌!

04-10-2026 | 11:52am

బస్టాప్‌(Bus stop)లో బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూసే ప్రయాణికులకు.. దూరంగా బస్సు కనిపించగానే ప్రాణం లేచొచ్చినట్టవుతుంది. బస్సు తమవైపే వస్తుందనుకుని హడావుడిగా ఎక్కేందుకు సిద్ధమవుతారు. కానీ బస్సు బస్టాప్‌కు చేరుకునే సమయంలో కొందరు ద్విచక్ర వాహనదారులు అదే వైపు నుంచి ముందుకు వెళ్లడంతో అసలు ఇబ్బంది మొదలవుతోంది.

బస్సు బస్టాప్‌లో ఆగేందుకు వస్తున్న సమయంలో బైక్‌లు, ఇతర వాహనాలు బస్సుకు ముందుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీంతో డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు దానిని అందుకోలేకపోతున్నారు. గంటల తరబడి ఎదురుచూసిన సమయం వృథా అవుతోంది.బస్సు కోసం ఎదురుచూసే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ.. కానీ బస్సు ఆగేది క్షణాలే. ఆ క్షణాల్లో వాహనదారులు కాస్త సహకరిస్తే.. ప్రయాణికులకు బస్సు మిస్ అయ్యే బాధ తప్పుతుంది.

మరిన్ని వార్తలు