అల్కరాజ్కు కలిసొచ్చిన అదృష్టం!
టోక్యోలో మరోసారి అల్కరాజ్ మ్యాజిక్.. సెమీస్ బెర్త్ ఖాయం!
టోక్యో: జపాన్ ఓపెన్‌లో(Carlos Alcaraz, Japan Open 2026) స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ దూసుకెళ్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో కెనడా ఆటగాడు డెనిస్ షాపోవాలోవ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలగడంతో అల్కరాజ్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. అప్పటికి అల్కరాజ్ 7-6, 1-0తో ఆధిక్యంలో ఉన్నాడు. రెండో సెట్ ప్రారంభంలోనే షాపోవాలోవ్( Denis Shapovalov vs Alcaraz) గాయపడటంతో మ్యాచ్ కొనసాగించలేక రిటైర్ అయ్యాడు.
ఈ విజయంతో అల్కరాజ్ టోక్యో టోర్నీలో(Japan Open tennis) వరుసగా రెండోసారి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఇప్పటికే మణికట్టు గాయం నుంచి కోలుకుని తిరిగి ఆటలోకి వచ్చిన అతడు.. వరుస విజయాలతో తన ఫామ్‌ను నిరూపించుకుంటున్నాడు. అయితే షాపోవాలోవ్ గాయం కారణంగా మ్యాచ్ ముగియడం టెన్నిస్ అభిమానులను నిరాశకు గురిచేసింది. అతడు త్వరగా కోలుకుని మళ్లీ కోర్టులోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.