ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలి

18-09-2026 | 08:02pm

అసెంబ్లీ ఎన్నికల్లో దొరలను మట్టికరిపించిన నేతకు గౌరవం ఇవ్వాలి.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు 

గంభీరావుపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌(MLA Aadi Srinivas)ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్స్ తినిపించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ, ఆది శ్రీనివాస్ మొక్కవోని ధైర్యంతో కష్టపడి ఎంపీపీ, జెడ్పీటీసీ, వేములవాడ దేవస్థానం చైర్మన్ వంటి పలు పదవులు చేపట్టి ప్రస్తుతం ప్రభుత్వ విప్ స్థాయికి ఎదిగారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొరలను మట్టికరిపించిన ఘనత ఆది శ్రీనివాస్‌కే దక్కుతుందన్నారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూనే, మరోవైపు బీసీ వర్గాల సమస్యలపై స్పందిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిపారు.అంతేకాకుండా, ఆది శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు