దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే!
బోథ్, అక్టోబర్ 12 (విజయ క్రాంతి): బోథ్ మండలంలోని సాయినగర్‌తో పాటు మరలపల్లిలో రామారావు ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే జాదవ్ అనిల్ (MLA Jadhav Anil) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దుర్గా కమిటీల ఆహ్వానం మేరకు ఆయన అమ్మవార్లను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు (Special Prayers) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తి వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్కరాజుతో పాటు నేరడిగొండ మండల నాయకులు పాల్గొన్నారు. దుర్గా కమిటీ సభ్యులు (Durga Committee Members) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు.