గాయత్రీ మాతగా అమ్మవారి దర్శనం

12-10-2026 | 01:44pm

వెంకటాపూర్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక భజన మండలి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన (Idol Installation) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు గాయత్రి మాత అవతారంలో గ్రామస్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారి విగ్రహాన్ని మిల్కూరి సులోచన–ఐలయ్య దంపతులు సమర్పించగా, అమ్మవారికి పట్టు వస్త్రాలను బూర సౌజన్య–సమ్మయ్య దంపతులు అందజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో (Special Prayers) పాల్గొన్నారు. దీంతో గ్రామపంచాయతీ ఆవరణలో భక్తి వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి దంపతులు, రమణారెడ్డి దంపతులు, చక్రపాణి దంపతులు, వినయ్ దంపతులతో పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక భజన మండలి సభ్యులు పల్నాటి రమేష్, పల్నాటి సురేష్, పల్నాటి కోటి, సన్ని, శ్యామ్, అక్కపెళ్లి హరీష్, పేర్ల రాకేష్, వరుణ్, ఆదిత్య, రాకేష్, రిశ్వంత్, కౌశిక్, పూర్ణేందర్ పాల్గొన్నారు. భవాని మాలాధారణ భక్తులు కృష్ణ, శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరై ఉత్సవాల్లో (Sharannavaratri Celebrations) భాగస్వాములయ్యారు.

మరిన్ని వార్తలు