సర్వసభ్య సమావేశానికి సర్పంచుల డుమ్మా..

18-09-2026 | 06:13pm

-సర్పంచుల గైర్హాజరుపై అధికారుల్లో అసహనం

-సభలో ఎనిమిది మంది సర్పంచులే..

వెంకటాపూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సర్పంచుల గైర్హాజరుతో సర్వసభ్య సమావేశం వెలవెలబోయింది. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి సర్వసభ్య సమావేశం(Mandal-level General Body Meeting) సర్పంచుల గైర్హాజరుతో చర్చ లేకుండానే ముగిసింది. మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు సమావేశానికి హాజరైనప్పటికీ, గ్రామాల అభివృద్ధికి కీలకమైన సర్పంచ్‌లు మాత్రం పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు.

మరిన్ని వార్తలు