స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో తోపులాట

18-09-2026 | 06:18pm

మోడీ ఫోటో లేకపోవడంపై బీజేపీ ఆగ్రహం

కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య బాహాబాహి

గంభీరావుపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Rration Card) పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.స్మార్ట్ రేషన్ కార్డులు, ఫ్లెక్సీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు అధికారుల సమక్షంలోనే వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. స్థితిగతులను గమనించిన తహసీల్దార్ మారుతి రెడ్డి జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మోడీ ఫోటోతో స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం కొంతసేపు నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు