విద్యా వికాసమే లక్ష్యంగా…
18-09-2026 | 06:56pm
సింగపూర్‌కు ఎంఈఓ పెండేకట్ల కృష్ణయ్య
ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): మండల పరిధిలోని రాయిపాడు గ్రామానికి చెందిన విద్యాధికారిగా లక్ష్మీదేవిపల్లి మండలం(Laxmidevipally Mandal)లో విధులు నిర్వహిస్తూ సింగపూర్ దేశంలో అమలవుతున్న ఆధునిక విద్యావిధానాలు, నూతన బోధనా పద్ధతులు, విద్యారంగంలో సాంకేతిక మెలకువలను అధ్యయనం చేసి, వాటిని మన తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో అమలు చేయాలనే ఉన్నత లక్ష్యంతో తన మిత్ర బృందంతో విదేశీయానం చేయుచున్న సందర్భంగా, వారి కుటుంబ సభ్యుల తరఫున శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి కోసం విదేశపర్యటన అవకాశం రావడం అభినందనీయం అన్నారు.