ఇంట్లో చోరీ.. 8 తులాల బంగారం అపహరణ
24-10-2026 | 09:50pm
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. లకావత్ బాల్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీరువాలోని సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదును అపహరించారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.