సూపర్ ఎల్నినో ఎఫెక్ట్.. నీటి వృథాపై భట్టి వార్నింగ్!
ఖమ్మం: ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలపై సూపర్ ఎల్నినో ప్రభావం (Super El Niño) ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితులు ప్రమాదకరమైనవని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
లండన్ వంటి నగరాల్లో నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని భట్టి విక్రమార్క వివరించారు. మహారాష్ట్రలోనూ నీటి వినియోగంపై కోటా విధించినట్లు తెలిపారు. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
ఎల్నినో పరిస్థితులపై రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. వాతావరణ పరిస్థితుల తీవ్రతను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమవుతోందని తెలిపారు (Government Measures).
నీటి వినియోగం, వనరుల నిర్వహణపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు (Water Conservation).