మూడు మండలాల స్థాయి జోనల్ గేమ్స్

24-10-2026 | 09:46pm

ములకలపల్లి,అక్టోబర్ 24 (విజయక్రాంతి): ములకలపల్లి, పాల్వంచ, బూర్గంపాడు మూడు మండలాల విద్యార్థుల(Students') కోసం జోనల్ గేమ్స్ ఈనెల 27,28 తేదీలలో మండలంలోని కమలాపురం ఆశ్రమ పాఠశాలలో(Ashram School) నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ(Mandal Education Department) అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం ములకలపల్లి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు మండలాల మండల విద్యాశాఖ అధికారులు (MEOs), కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పీడీలు (PDs) మరియు పీఈటీలు (PETs) పాల్గొన్నారు.

*క్రీడా పోటీల షెడ్యూల్

27-10-2026, మంగళవారం బాలికలకు క్రీడా పోటీలు నిర్వహించబడును.28-10-2026, బుధవారం బాలురకు క్రీడా పోటీలు నిర్వహించబడును.కబడ్డీ,ఖో-ఖో,వాలీబాల్,అథ్లెటిక్స్ జూనియర్స్: అండర్-14,సీనియర్స్: అండర్-17 విభాగంలో పోటీలు జరుగుతాయి.మూడు మండలాల నుంచి జోనల్ గేమ్స్‌లో పాల్గొనే బాలబాలికలు,సంబంధిత పాఠశాలల పీడీలు, పీఈటీలు నిర్ణీత తేదీలలో ఉదయం 9:00 గంటలకు AHS, కమలాపురం ములకలపల్లి మండలంలో రిపోర్ట్ చేయవలసిందిగా తెలిపారు.సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పీడీలు, పీఈటీలు మరియు క్రీడాకారులు సహకరించి జోనల్ గేమ్స్ విజయవంతం చేయవలసిందిగా కోరారు.

మరిన్ని వార్తలు