ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
నర్సాపూర్: ఆర్థిక ఇబ్బందులు(Financial difficulties), అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య(Suicide) చేసుకున్న సంఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కంచం బిక్షపతి (32) కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, అప్పుల విషయమై తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 20న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకున్నాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రి(Narsapur Government Hospital)కి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిక్షపతి గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య శేకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ ఏ. రంజిత్ కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.