ఫిరాయింపులపై కీలక తీర్పు!
ఒకప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకే పరిమితమైన ‘ఆయారామ్ గయారామ్’ సంస్కృతికి తెలంగాణ రాజకీయాలు కూడా అద్దం పట్టడం శోచనీయం. ప్రజల ఆకాంక్షల మేరకు ౬ దశా బ్దాల పోరాటం అనంతరం ఏర్పడిన తెలంగాణ.. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతుందని అంతా ఆశించారు.
కానీ రాష్ట్రం సిద్ధించిన ఈ పుష్కర కా లంలో 52 మంది శాసనసభ్యులు పార్టీలు మారడంతో తెలంగాణ ‘ఫిరాయింపుల కేంద్రం’గా మారిందని, ఫలితంగా రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నదనే ఆవేదన వ్యక్తమవుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 30 మంది సభ్యుల్లో 22 మంది పార్టీ మారారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత కూడా పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడలేదు.
‘నీవు నేర్పిన విద్యయే నీర జాక్ష’ అన్న చందంగా బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది సభ్యులు అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఈ పది మందిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. కానీ, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుండటంతో బీఆర్‌ఎస్ న్యాయపోరాటానికి ది గింది. ఎట్టకేలకు బీఆర్‌ఎస్, బీజేపీల పో రాటం ఫలించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దా నం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
మొదటి అనర్హత ‘దానం’పైనే
తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్‌ఆర్, బహుజన సమాజ్ పార్టీలకు చెందిన 28 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్, టీడీపీల నుం చి 14 మంది, 2023 ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ నుంచి 10మంది సభ్యులు ఇత ర పార్టీల వైపు వెళ్లారు. కానీ, అందులో ఏ ఒక్క సభ్యుడిపైన స్పీకర్ చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న మినహాయింపులు, 2/3వ వంతు నిబంధనను అడ్డంపెట్టుకొని అనర్హత వేటు నుంచి తప్పించుకు న్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. పదో షెడ్యూల్‌లో విలీన నిబంధన ప్రకా రం.. 2/3వ వంతు అంటే 26 మంది శాసనసభ్యులు పార్టీ మారితే వారిపై అనర్హత వేటు పడదు. కానీ, 10 మంది మాత్రమే పార్టీ మారడంతో ఈ సంఖ్య 2/3వ వం తుకు చేరలేదు.
ఇక 2018లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందగా, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో వారు అన ర్హత వేటు నుంచి తప్పించుకోగలిగారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 10 మందిపై అనర్హతకు అవకాశం లేనప్పటికీ, బీఆర్‌ఎస్ గట్టి న్యాయపోరాటం చేసింది.
ఒకానొక సందర్భంలో అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట కూడా ఉపఎన్నిక రాదు అని మాట్లా డినా, ట్రిబ్యునల్ చైర్మన్‌గా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది సభ్యులపైన ఉన్న అనర్హత పిటిషన్లను కొట్టివేసినా పట్టు విడవకుండా బీఆర్‌ఎస్, బీజేపీలు హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లాయి. స్పీకర్ ద్వారా కాకుండా కోర్టు తీర్పు ద్వారా అనర్హత వే టుకు గురైన మొదటి తెలంగాణ ఎమ్మెల్యే గా దానం నాగేందర్ నిలిచిపోయారు.
ఒక్క సభ్యునికే పరిమితమా!
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో అన ర్హతకు సంబంధించి బలమైన ఆధారాలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఉన్నాయి. వారిపైన కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా స్పీకర్ పది మందిపై ఉన్న అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. దానం నాగేందర్‌ను అనర్హుడుగా ప్రకటించాలని హైకోర్టు మెట్లు తొక్కారు.
దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. కడియం శ్రీహరితోపాటు మిగ తా ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించాలని కోర్టుకు వెళ్లే అవ కాశాలు ఉన్నాయి. కడియం శ్రీహరి విషయంలోనూ సాంకేతిక, చట్టపరమైన ఆధా రాలున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యం లో అనర్హత వేటు పడే అవకాశాలు ఉండవచ్చు. పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చర్యలు చేపట్టలేమని విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్య లు చూస్తుంటే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరి ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశాలు కనిపించటం లేదు.
కానీ దానంపై వేటుపడటంతో విపక్షంలో నైతిక ధైర్యం పెరిగిందనే చెప్పాలి. కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ముకుల్‌రాయ్ టీఎంసీలోకి ఫిరాయించటంతో 2025లో కోల్‌కత హైకోర్టు రాయ్ ను అనర్హుడుగా ప్రకటించింది. దీంతో ము కుల్‌రాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించా రు. బీజేపీ సరైన ఆధారాలను కోర్టు ముం దు ఉంచడంలో విఫలం కావడంతో హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ముకుల్ రాయ్ శాసనసభ్యుడిగా కొనసాగారు. కానీ దానంకు సుప్రీంకోర్టులో ఊరట లభించకపోవడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
చట్టం పదును తేలాలి
1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చినా, 2023లో చట్ట సవరణలు ప్రతిపాదించినా అందులోని మినహాయిం పు లను అడ్డం పెట్టుకొని వ్యక్తిగత ఫిరాయింపుల స్థానే సామూహిక ఫిరాయింపులకు పాల్పడటంతో చట్టం అపహాస్యమవుతోం ది. కాబట్టి పార్టీ ఫిరాయింపులను నిరోధించటానికి చట్టం మరింత పదును తేలాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఏదైనా ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లేదా ఎంపీ పార్టీ మారిన 24గం టల్లోనే స్పీకర్ అతన్ని అనర్హుడుగా ప్రకటించే కఠి ననిబంధన తీసుకరాకపోతే ఫిరాయింపులను నిరోధించటం అంత తేలికేమీ కాదు.
ఖైరతాబాద్‌లో గెలుపుపై లెక్కలు
ఖైరతాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే ఉండనుంది. ఇక్కడి నుంచి 2009లో కాం గ్రెస్, 2014లో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున దానం నాగేందర్ విజయం సా ధించారు. ఈ నియోజకవర్గంలో పి.జనార్దన్‌రెడ్డి కుటుంబానికి, దానం నాగేందర్‌కు వ్యక్తిగత బలం, అనుచరగణం ఉంది. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండటం, ఆ పార్టీ అధికారంలో ఉండటం తో ఉపఎన్నికలో గెలుపునకు కొంత అను కూలిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోం ది. సామాజిక సమీకరణాలతో పాటు 23 శాతం ఉన్న మైనార్టీలు అభ్యర్థి గెలుపులో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు.
వ్యాసకర్త సెల్ 9885465877