ప్రజల చేతిలో వజ్రాయుధం.. ఆర్టీఐ చట్టం!

12-10-2026 | 02:55pm

జనగామ, అక్టోబర్ 12 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం (RTI) 2005 దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ఖాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి గోపాలదాస్ ఉపేందర్, జిల్లా ఇన్‌చార్జి నీలం భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధమని, ప్రతి పౌరుడు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చట్ట ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, సాధారణంగా 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ శాఖల్లో జరిగే అవకతవకలు, అవినీతిని వెలికితీయడంలో సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ సతీష్, ప్రధాన కార్యదర్శి బైరి భరత్, కార్యదర్శి నల్ల విక్రమ్, పట్టణ అధ్యక్షులు గందమళ్ళ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు