మత్స్య సహకార సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
తరిగొప్పుల, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తరిగొప్పుల మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు(Fisheries Industrial Cooperative Society Elections) ఏకగ్రీవంగా జరిగాయి. నూతన కార్యవర్గంలో చైర్మన్గా పండుగ కనకయ్య, వైస్ చైర్మన్గా సుంకరి కనకరాజు, కార్యదర్శిగా కలకుంట్ల సాంబరాజు ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా పండుగ శ్రీకాంత్, సుంకరి వెంకటేష్, చిలువేరు రాజశేఖర్, సుంకరి బాలరాజు, కలకుంట్ల రాజేందర్, మాదరబోయిన కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ముదిరాజ్ పెద్దలు, యువకులు ఘనంగా సన్మానించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తామని నూతన చైర్మన్ పండుగ కనకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిలువేరు లింగం, తరిగొప్పుల మహాసభ అధ్యక్షులు సుంకరి నరసింహులు, ఉప సర్పంచ్ చిలువేరు మహేందర్, కలకుంట్ల రాజు, మాజీ చైర్మన్ చిలువేరు ఉప్పలయ్య, చిలువేరు సంపత్, దండబోయిన రాములు, చిలువేరు సతీష్, కలకుంట్ల రాజు, సుంకరి రవి, సుంకరి ఉప్పలయ్య, కలకుంట్ల రాకేష్, దండబోయిన శేఖర్, కలకుంట్ల బాపురాజు తదితర ముదిరాజ్ సంఘ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.