మహిళా సమైక్య భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే

23-10-2026 | 03:40pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 23 (విజయ క్రాంతి):మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి మహిళా సమైక్య భవనం మంజూరు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు(MLA Madan Mohan Rao) గ్రామ మహిళా సంఘాల సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.నాగిరెడ్డిపేట గ్రామానికి మండల సమైక్య భవనం మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

గ్రామానికి మండల సమైక్య భవనం లేనందున రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాల్పేటకు వెళ్ళవలసి ఉండేదని దీనితో ఆ కష్టాలు తీరాయని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్,మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి,సీనియర్ నాయకులు నరసింహరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఠాగూర్,మండల బీసీ సెల్ అధ్యక్షులు సాయ గౌడ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,సాయి కుమార్,మైనార్టీ అధ్యక్షుడు షకీల్,ఎస్సీ సెల్ అధ్యక్షులు సంపత్,యూత్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్,గ్రామ పెద్దలు కిషన్,సాయ గౌడ్, బాలయ్య,రాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు