ముందస్తు అరెస్టులపై బీఆర్‌ఎస్ నేతల నిరసన
24-09-2026 | 12:38pm
గణపురం,(విజయక్రాంతి): గణపురం మండలం(Ganapuram Mandal) చెల్పూర్‌లోని విద్యుత్ కేంద్రం సందర్శనకు వస్తున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులను కలవకుండా తమను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) తీవ్రంగా ఖండించారు. విద్యుత్ కోతలపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని, ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ముందస్తుగా అరెస్టయిన వారిలో బీఆర్‌ఎస్ గణపురం మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి, సర్పంచులు ఉడుత సాంబయ్య యాదవ్, కొడారి హైమావతి ధనుంజయ్, గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు హఫీజ్, సీనియర్ నాయకులు దాసరి రవీందర్, గాజర్ల చింటూ గౌడ్, మామిండ్ల సాంబయ్య యాదవ్, పబ్బ రవీందర్ గౌడ్ ఉన్నారు.