రెండు డీఏలకు సానుకూలం

24-09-2026 | 05:40am
  1. సీపీఎస్‌పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం 
  2. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి వెల్లడి 
  3. సీఎస్‌కు ఎంప్లాయీస్ సమస్యలను వివరించిన ప్రతినిధులు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల(DA released) చేసేందుకు  ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి(Telangana Employees JAC Chairman V. Lachireddy) తెలిపారు. సీపీఎస్ విషయంలో ఉద్యోగులు, అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పిందన్నారు.సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసు కుంటామని సీఎస్ హామీ ఇచ్చారని  చెప్పా రు. బుధవారం సీఎస్‌తో ఉద్యోగుల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం లచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ అంశంలో కూడా సీఎస్ సానుకూలత వ్యక్తం చేశారని, సాధ్యమైనంత తర్వగా నివేదిక ఇ వ్వాలని పీఆర్సీ కమిటీని కోరారని తెలిపారు. 

సీఎస్ దృష్టికి ఉద్యోగుల సమస్యలు

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాని సీఎస్‌కు తాము విజ్ఞప్తి చేశామని లచ్చిరెడ్డి చెప్పారు. సీపీఎస్‌తో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగేండ్ల సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్ స్కీమ్, రెవెన్యూ శాఖలో గత 20 ఏండ్లుగా పనిచేస్తున్న 620 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సేవలను కొనసాగించడమే కాకుండా మంజురైన గ్రామ పరిపాలన పోస్టుల్లో అర్హత ప్రకారం అవకాశం కల్పించాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరినట్లు ఆయన వివరించారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు(Pending bills) మూడు నెలల్లోగా విడుదల చేయాలని, అద్దె వాహన చార్జీలను నెలకు రూ. 33 వేల నుంచి 75 వేల వరకు పెంచాలని, గ్రాట్యుటీ మొత్తాన్ని కనీసం రూ. 20 లక్షలకు వరకు పెంచాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉద్యోగులందరికీ ఇంటర్ డిస్ట్రిక్ స్పౌస్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యంతో పాలు మరికొన్ని సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. సీఎస్‌ను కలిసిన వారిలో లచ్చిరెడ్డితో పాటు జేఏసీ సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్, నాయకులు ఎస్ రాములు, నిర్మల, రమేశ్ పాక, కృష్ణుడు, దర్శన్‌గౌడ్, జగదీశ్వర్‌రెడ్డి, గరికె ఉపేందర్‌రావు, పెంటయ్య, రామరాజు, రాబర్ట్ బ్రూస్ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు