ఆ విష పురుగులు కాటేస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి

19-09-2026 | 10:45pm

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఆ విష పురుగులు కాటేస్తే తప్పక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వైద్యులు హిమబిందు మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలకు విష పురుగులు పాముకాటు(snakebites)పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

పాము కాటు ద్వారా ప్రజలు ఎవరైనా ఆందోళన చెందవలసిన అవసరం లేదని తక్షణమే ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలని ప్రభుత్వాసుపత్రి(Government)లో పాముకాటుకు ప్రత్యేక వైద్యం ఉందని నాటు వైద్యం చేసుకుని ప్రజలు అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దని ఆమె సూచించారు. పలువురు ప్రజలు పాముకాటు వేసిన ప్రదేశంలో గాయం చేసి నోటి ద్వారా విషాన్ని బయటకు పీల్చడం వంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని వాటిని మానుకొని ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని వైద్యాధికారి హిమబిందు తెలిపారు.

మరిన్ని వార్తలు