ఇంటి వద్ద పిల్లలను చదివించే బాధ్యత తల్లిదండ్రులదే
19-09-2026 | 10:56pm
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): పిల్లలను బడికి పంపిస్తున్నాం మా పని అయిపోయింది అంటూ నిశ్చింతగా మీరు ఉంటే మీ విద్యార్థుల భవిష్యత్తు నీటిలో వేసిన రాయిలాగా మారుతుందని కాస్త సమయం మీ విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహిస్తే మీ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆల్తాఫ్ జహంగీర్ అన్నారు.
శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీ విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని మీరు కూడా మీ విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.