జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్ రియాక్షన్
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం
మేం ఏదైనా తప్పుచేసినట్టు తేలితే..
ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధం-కేటీఆర్
అధికారం మీ చేతుల్లోనే ఉంది
అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండి-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 19: జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలో ఉందని అన్నారు. తాము ఏదైనా తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని స్పష్టం చేశారు. అధికారం మీ చేతుల్లోనే ఉందని, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వనపర్తి జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గుమ్మడం, పెబ్బేరు సబ్‌స్టేషన్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో ఎక్కడా 12 గంటల విద్యుత్ సరఫరా కూడా జరగడం లేదని ఆరోపించారు. జూరాలలో నీళ్లు ఉన్నప్పటికీ పాలమూరు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ దిగువకు నీటిని విడుదల చేశారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేశారని కేటీఆర్ అన్నారు.