అక్టోబర్ 6న హైదరాబాద్ లో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ..

18-09-2026 | 10:47pm

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ 

బాన్సువాడ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వచ్చేనెల అక్టోబర్ 6న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరావాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశం ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కో ఇన్చార్జిలు మావురం శ్రీకాంత్ మాదిగ, మెక్కా సాయి మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నిజామాబాద్ & మెదక్ జిల్లాల ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ హాజరై మాట్లాడుతూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ 30 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. వర్గీకరణ ఫలాలు ప్రతి మాదిగ బిడ్డ మరియు ఉపకులాలు అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ సూచన మేరకు విద్య హక్కు పరిరక్షణ సామాజిక న్యాయం సమాన అవకాశాల సాధన కోసం ఎంఎస్ఎఫ్ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.

మరిన్ని వార్తలు