మూడు మండలాల నుంచి భారీ చేరికలు
18-09-2026 | 11:36pm
కవిత నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తాం: మజీద్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల నుంచి దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena)లో చేరారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మజీద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ.. కవిత నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ నెల 20న కొడంగల్లో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి విధానాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.