రామప్ప శిల్పకళకు విదేశీ ప్రతినిధుల ప్రశంసలు

18-09-2026 | 11:40pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని రామప్ప దేవాలయ(Ramappa Temple) శిల్పకళ, కాకతీయుల నిర్మాణ నైపుణ్యం విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి(Pingili Sripal Reddy) ఆధ్వర్యంలో టర్కీ దేశానికి చెందిన ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు శుక్రవారం రామప్పను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఎమ్మెల్సీతో పాటు విదేశీ ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు.

రామప్ప ఆలయంలోని శిల్పాలు, మండపాలు, కాకతీయుల నిర్మాణ ప్రత్యేకతలను ప్రతినిధులు ఆసక్తిగా పరిశీలించారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రామప్ప దేవాలయ విశిష్టతలను వారికి వివరించారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన తేలికపాటి ఇటుకల ప్రత్యేకతను ప్రత్యక్షంగా చూపించి, వాటి నిర్మాణ విధానం గురించి వివరించారు. రామప్ప చరిత్ర, కాకతీయుల కళా వైభవం, ఆలయంలోని శిల్పాల విశిష్టతలను టూరిజం గైడ్ విజయ్ వివరించారు. రామప్ప శిల్పకళ, ఆనాటి శిల్పుల ప్రతిభ తమను ఆకట్టుకున్నాయని వారు పేర్కొన్నారు. వారి వెంట పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్, పలువురు జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు, మహిళా ప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బందిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు