ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు..

18-09-2026 | 07:12pm

బాన్సువాడ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి అధికారులు సిబ్బంది శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం నైవేద్యం సమర్పించారు. అధికారులు, సిబ్బంది పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుని ఆశీస్సులతో కార్యాలయ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. కార్యాలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో సందడిగా మారింది. కార్యాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

మరిన్ని వార్తలు