పోషకాహారంపై అంగన్వాడీల అవగాహన

18-09-2026 | 05:17pm

గర్భిణీలు,బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: సీడీపీవో నిర్మల జ్యోతి

కల్లూరు, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు(Nutritional values) కలిగిన ఆహారాన్ని ఇంటివద్దే తయారు చేసుకుని గర్భిణీలు, బాలింతలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ సీడీపీవో నిర్మల జ్యోతి(ICDS CDPO Nirmala Jyothi) సూచించారు.శుక్రవారం రఘునాథగూడెంలో(Raghunathagudem) సూపర్‌వైజర్‌ సుజాత ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.అంగన్వాడీ టీచర్లు టీహెచ్‌ఆర్‌ ఆహార పదార్థాలతో తయారు చేసిన పోషక వంటకాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు.

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణీలకు సాంప్రదాయ పద్ధతిలో సామూహిక సీమంతాలు నిర్వహించారు.కార్యక్రమంలో సర్పంచ్‌ సుధారాణి, ఉపసర్పంచ్‌ కోటేశ్వరి, సూపర్‌వైజర్‌ సుజాత,గ్రామ పెద్దలు కుక్క రానా కర్నాటి రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్లు పొనుగుమాటి శ్రీనివాసరావు, నాగవేణి,అంగన్వాడీ టీచర్లు రేవతి ప్రియాంక,పద్మ,ఆయా సీతారావమ్ము,గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు