మట్టి గణపతికి ఘనంగా వీడ్కోలు

22-09-2026 | 02:52pm

కల్లూరు, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు(Environmental Protection) ప్రాధాన్యమిస్తూ రఘునాథ బంజర పడమటి బజార్ గణేశ్ కమిటీ సభ్యులు ఏడేళ్లుగా మట్టి గణపతినే స్వయంగా తయారు చేసి ప్రతిష్ఠిస్తున్నారు.ఈ సంవత్సరం విగ్రహ తయారీ ఖర్చును సర్పంచ్ కుక్క సుధారాణి రానా (Sarpanch Kukka Sudharani Rana)అందించారు.మంగళవారం సర్పంచ్ దంపతులు గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుధారాణి రానా చేతుల మీదుగా అన్నదానం ప్రారంభమైంది.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.మట్టి గణపతిని కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు సందేశమిస్తున్న కమిటీని గ్రామస్తులు అభినందించారు.కార్యక్రమంలో గ్రామస్తులు, కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు