నోటిఫికేషన్ వేళ..దానంకు సుప్రీం విచారణ గండం!
22-09-2026 | 08:45am
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో రేపు విచారణ జరగనుంది. పిటిషన్‌ను అత్యవసరంగా మంగళవారమే విచారించాలని దానం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, అందువల్ల పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని దానం తరఫు న్యాయవాది వాదించారు.
అయితే ప్రతివాదుల తరఫు న్యాయవాది మాత్రం పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది.