ఆపదలో అండగా నిలిచిన మానవత్వం… అదే నిజమైన ప్రజాసేవ
సత్తుపల్లి. సెప్టెంబర్ 22. ( విజయ క్రాంతి ): సహాయం చిన్నదైనా… దాని వెనుక ఉన్న మానవత్వం ఎంతో గొప్పది. సత్తుపల్లి గాంధీనగర్‌కు(Sathupalli Gandhinagar) చెందిన క్యాన్సర్ బాధిత చిన్నారి చార్లెస్ విన్నీ వైద్య చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త గుంజి వెంకటేశ్వరరావు(BRS party key activist Gunji Venkateswara Rao) ఆధ్వర్యంలో వేముల పండు, పువ్వాడపు వెంకటేశ్వరరావు, తిరుపతి శ్రీను, షేక్ సర్దార్, కన్నెపోగు వెంకటరావు, శివ, రమేష్, బాలాజీ, కృష్ణ తదితరులు ముందుకు వచ్చారు.
చిన్నారి వైద్య చికిత్స కోసం రూ.7,000 ఆర్థిక సహాయం అందించి, కుటుంబానికి తమ వంతు ధైర్యాన్ని ఇచ్చారు.
ఒక చిన్నారి కష్టాన్ని మన కష్టంగా భావించి చేయూత అందించడం…
ఒక కుటుంబం కన్నీటిలో మన మానవత్వాన్ని చూడటం…
ఆపదలో ఉన్నవారికి “మేమున్నాం” అని భరోసా ఇవ్వడం…
ఇవే సమాజాన్ని నిలబెట్టే నిజమైన విలువలు. రాజకీయాలు, వర్గాలు, భేదాలు పక్కన పెట్టి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరి సేవా భావం అభినందనీయం. ఇలాంటి మానవతా స్పందనలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి. మనిషికి మనిషి అండగా నిలిచినప్పుడే… సమాజంలో మానవత్వం బలపడుతుంది. చిన్నారి చార్లెస్ విన్నీ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా చిరునవ్వులు చిందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.