నేడు జూరాల రైతులతో బీజేపీ నేతల ముఖాముఖి

22-09-2026 | 07:27am

హైదరాబాద్: పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు(BJP leaders) నేడు జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రైతులతో బీజేపీ నేతలు ముఖాముఖి నిర్వహించనున్నారు. 

రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాగునీటి లభ్యత, పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులతో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాగుకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు