ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన నరేష్
సింగరేణి అక్టోబర్ 24 విజయక్రాంతి : సింగరేణి మండలంలోని(Singareni Mandal) గోవిందు తండాలో కాంగ్రెస్ నాయకుడు నరేష్ కుమార్(Congress leader Naresh Kumar) శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన రాజేష్ బానోత్, శివ, వినోద్ కుటుంబాలను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.పార్టీలకు అతీతంగా బాధితులకు అండగా ఉంటామని, సీఎంఆర్ఎఫ్(CMRF) ద్వారా ప్రభుత్వ ఆర్థిక సాయం(Government financial aid) అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానోతు లాలు, వార్డు సభ్యులు బానోత్ సౌందర్య, నగేష్, బర్మావత్ గోవిందు నాయక్, బాదావత్ వీరు నాయక్, భానోత్ కోటేశ్వరరావు, మల్లికార్జున్, వంకుదోత్ వీరన్న, బట్టు నరసయ్య, బర్మావత్ వీర నాయక్, ముదిగొండ వెంకన్న, కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.