భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

20-09-2026 | 12:01am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని బాబాపూర్ ఎన్‌జేపీ గురుకుల పాఠశాల(Babapur NJP Gurukul School)లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో(Ganapati Navaratri Celebrations) భాగంగా ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక బృందం, సిబ్బంది విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి తుంపెల్లి వాగులో నిమజ్జనం చేశారు.

మరిన్ని వార్తలు