సాగు భూమిని సంరక్షించుకోవాలి

22-10-2026 | 04:03pm

కలెక్టర్ కుమార్ దీపక్ 

హాజీపూర్, (విజయక్రాంతి) : రైతులు సాగు భూమిని(Farmers' cultivated land) సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అనవసరంగా ఎరువులు, పురుగు మందులు ఉపయోగించవద్దని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) సూచించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా గురు వారం నిర్వహించిన ‘సాగు భూమి సంరక్షణ (కేత్ బచావో అభియాన్)’.

కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులనుద్దేశించి ప్రసంగించిన సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం భూసార పరిరక్షణ, స్థిరమైన వ్యవసాయం, రైతుల ఆదాయం పెంపు, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపు వంటి అంశాల ప్రాముఖ్యతను కలెక్టర్ వివరించారు.

భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సుస్థిరంగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. అదే విధంగా ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా పత్తి మార్కెటింగ్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకొని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) పథకం కింద పత్తిని విక్రయించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యాప్ వినియోగం, రైతుల నమోదు, కొనుగోలు ప్రక్రియపై రైతులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) ఎల్తూరి సురేఖ, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి భనేష్, ఆత్మ (ATMA) చైర్మన్ సింగతి మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) డైరెక్టర్లు పుస్కూరి శ్రీనివాస్ రావు, బొడ్డు శంకర్,

బొలిశెట్టి తిరుపతి, వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) మామిడి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి (MAO) కృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మధుప, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు