ఇసుక మాఫియా నుండి స్మశానాన్ని రక్షించండి
22-10-2026 | 05:09pm
రాజాపూర్: ఇసుక మాఫియా(Sand Mafia) బాల్ నుండి తమ స్మశాన వాటికను పరిరక్షించాలని మండల కేంద్రానికి చెందిన ఆరెకటిక సంఘం నాయకులు గురువారం తాసిల్దార్ రాధాకృష్ణ(Tahsildar Radhakrishna)కు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రం దుందుభి వాగు పరివాహ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికను ఇసుక మాఫియా వారు రాత్రిళ్ళు భారీ యంత్రాలతో స్మశాన వాటిక స్థలాన్ని తొవ్వి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారని తెలిపారు. వాగు పదివాక ప్రాంతం వదిలి మా స్మశాన వాటికను కూడా వదలని ఇసుక మాఫియా పై తగిన చర్యలు తీసుకోవాలని ఆరెకటిక సంఘం నాయకులు కోరారు.