వర్షానికి కూలిన ఇల్లు

18-09-2026 | 10:30pm

చేగుంట సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): చేగుంట మండలం(Chegunta Mandal) కర్ణాలపల్లి గ్రామంలో గత 2, 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిరుపేద కుటుంబానికి చెందిన కానుగంటి బైరమ్మ ఇల్లు శుక్రవారం ఉదయం ఒకసారిగా కూలిపోయింది. అక్కడే పడుకున్న బైరమ్మకు సల్ప గాయాలు అయినవి, విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ శివ, వార్డ్ సభ్యులు, గ్రామ జిపిఓ కార్యదర్శితో కలిసి కూలిన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఉపసర్పంచ్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని  వారు కోరారు.

మరిన్ని వార్తలు