‘అది బ్యాడ్ టచ్ కాదు.. ప్యూర్ లవ్’

04-10-2026 | 08:21am

పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ఫొటోలు (Photos) దిగుతున్న నటి రచిత రామ్‌ (Rachita Ram)కు ఎదురైన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) చర్చనీయాంశంగా మారింది. అభిమానులతో ఫొటోలు దిగుతున్న సమయంలో అభిమానులు ఆమె బుగ్గలు గిల్లడంతో ఈ వీడియోకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే దీనిపై తాజాగా రచిత రామ్ స్పందిస్తూ క్లారిటీ (Clarity) ఇచ్చారు. ఆ అభిమానులు తనను చెడుగా తాకలేదని ఆమె స్పష్టం చేశారు.

‘నాకు బ్యాడ్‌గా అనిపించలేదు’

అభిమాని తన బుగ్గలను పట్టుకున్న విధానం తనకు చెడుగా అనిపించలేదని రచిత తెలిపారు. చిన్నపిల్లల బుగ్గలను ప్రేమగా పట్టుకున్నట్టుగానే తనకు అనిపించిందని చెప్పారు. అందుకే ఆ సమయంలో తనకు కోపం (Anger) కూడా రాలేదని ఆమె పేర్కొన్నారు. “అది బ్యాడ్ టచ్ (Bad Touch) కాదు.. ప్యూర్ లవ్‌ (Pure Love)తో అలా చేశారు. అందుకే నాకు కోపం రాలేదు” అని రచిత రామ్ స్పష్టం చేశారు.

అభిమానులపై రచిత స్పందన

తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చూపించిన ప్రేమకు రచిత రామ్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులతో సెలబ్రేషన్‌ (Celebration) సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆమె ఇచ్చిన వివరణతో వివాదానికి తెరపడినట్లైంది.

మరిన్ని వార్తలు