వేగం పెంచాలి

04-10-2026 | 05:30am

ఆసుపత్రుల నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  1. కలెక్టర్లు ఫీల్డ్‌కు వెళ్లాల్సిందే..
  2. దవాఖానలు, పాఠశాలలను సందర్శించాలి వారానికోసారి సమీక్ష తప్పనిసరి
  3. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్ర పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ముఖ్యంగా ఆస్పత్రులు, పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి, వారానికోసారి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. శనివారం సీఎంవో అధికారులతో రివ్యూ నిర్వహించారు. విద్య, వైద్యానికి  సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు.

ప్రధాన ఆసుపత్రుల నిర్మాణం, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తయ్యేనాటికి అవసరమైన అత్యాధునిక పరికరాలను కొను గోలు చేసి, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మిగతా ఆస్పత్రుల్లోనూ వైద్యసిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాఠశాలలను సంద ర్శించి  విద్య, వసతులపై దృష్టి సారించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2026 ఏర్పాట్లపైనా సీఎం సమీక్షించారు.

సదస్సు విజయవంతానికి పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని, త్వరలోనే ఏర్పా ట్లను పరిశీలిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు