బోరు మోటారు విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ
తమ్ముడిని హతమార్చిన అన్న
నిందితుడి అరెస్టు. రిమాండ్‌కు తరలింపు.
అచ్చంపేట, అక్టోబర్ 24: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) సిద్దాపూర్ పోలీస్‌స్టేషన్(Siddapur Police Station) పరిధిలోని బక్కలింగాయపల్లి గ్రామంలో బోరు మోటారు విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో తమ్ముడు కేతావత్ మోహన్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న బోరు మోటారు(Bore Motor) విషయంలో జరిగిన వివాదంలో అన్న బావ్‌సింగ్ కట్టెతో మోహన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మోహన్ మృతి చెందడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బావ్‌సింగ్‌ను శనివారం అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు అచ్చంపేట సీఐ నాగరాజు ఏశమళ్ల తెలిపారు.