పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

24-10-2026 | 10:19pm

జిల్లా న్యాయమూర్తి శారదాదేవి

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): ఆర్థిక స్థోమత లేని నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం(Free Legal Aid) అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ వి.శారదాదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ (Under-trial Review Committee) సమావేశంలో ఆమె పాల్గొని విచారణలో ఉన్న ఖైదీల కేసులను సమీక్షించారు.ఈ సందర్భంగా చట్టప్రకారం బెయిల్‌ మంజూరైన కేసుల్లో ఖైదీల విడుదలకు అనవసర జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

న్యాయ సహాయం అవసరమైన విచారణ ఖైదీల వివరాలను పరిశీలించి, తగిన చర్యల నిమిత్తం ఎంపవర్‌ కమిటీకి సిఫారసు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ నిరుపేద ఖైదీ న్యాయ సహాయానికి దూరం కాకూడదని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.అనూష, జిల్లా రెవెన్యూ అధికారి, జైలు సూపరింటెండెంట్‌ ప్రేమ్‌కుమార్‌, ఆసిఫాబాద్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు