కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతవరకు ముక్కిడి గుండం రోడ్డు వేయలేరు

30-09-2026 | 03:04pm

జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆరోపించారు

కొల్లాపూర్ సెప్టెంబర్ 30: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని ముక్కిడిగుండం(Mukkidigundam ) గ్రామంలో బుధవారం అధికారులతో కలిసి. ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు(ST National Commission Members) జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించారు. తండాల్లో లంబాడి సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను. పోడు భూములు. రెవెన్యూ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దామని. వెటర్నరీ హాస్పిటల్. పల్లె దావకాన ఏర్పాటు చేయాలని. అదేవిధంగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి గోడు ఎలబోస్కున్నారు.

జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ. ఎస్టీ రైతులు ఎవరికైతే పోడు భూములు పట్టాలు ఉన్నాయో వారి పంట పొలాల్లో బోర్లు వేసుకునే అవకాశం వాళ్లకు ఉందన్నారు. రైతులు బోర్లు వేసుకుంటుంటే అడ్డుకునే హక్కు ఫారెస్ట్ అధికారులకు లేదని వారు ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పోయేంతవరకు రోడ్లు వేయలేరని కాంట్రాక్టర్లు చేసిన పనులకి ఎనిమిదేళ్ల నుంచి డబ్బులు రాక నాన్న అవస్థలు పడుతున్నారన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజక వర్గ బిజెపి ఏల్లేని సుధాకర్ రావు. బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు నారాయణ. కొల్లాపూర్ ఆర్డీవో బాన్సులాల్. ఎమ్మార్వో మాధవి. సర్పంచ్ లాలి . బిజెపి నాయకులు లంబాడి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు