విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అశోక్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి); విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్(Telangana Grameena Bank) మేనేజర్ అశోక్ అన్నారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుల్తానాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేస్తూ, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను మరియు బంధువుల కు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉంటూ, తెలియని వారికి ఓటిపి మరియు కార్డు వివరాలు చెప్పకూడదు అని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం శ్రీవాణి కళాశాలలో ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.