సీజేపీతో నో రిలేషన్‌..యూటర్న్ కారణం ఏంటి?

12-10-2026 | 12:19pm

న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ (YouTuber Dhruv Rathee) యూటర్న్‌ తీసుకోవండం హాట్ టాపిక్‎గా మారింది. సీజేపీ (CJP)తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల సీజేపీకి మద్దతుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అనంతరం పూచీకత్తుపై విడుదలయ్యారు.

అరెస్ట్‌ అనంతరం కూడా ధ్రువ్‌ రాఠీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, ఇప్పుడు సీజేపీతో తనకు సంబంధం లేదని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం (Political Development) నేపథ్యంలో ఆయన వైఖరిపై పలు చర్చలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు