సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన బిజెపి నాయకులు

18-09-2026 | 06:08pm

​నారాయణఖేడ్, సెప్టెంబర్ 18: నారాయణఖేడ్ మండల పరిధిలోని సంజీవరావుపేట గ్రామానికి చెందిన బుజ్జం రాములుకు ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister's Relief Fund) ద్వారా మంజూరైన రూ. 28,500 లబ్ధి చెక్కును ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) చొరవతో శుక్రవారం అందించారు. ​

ఈ చెక్కును బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్రీ రామకృష్ణ, మండల అధ్యక్షులు సిందోల్ దశరథ్, మాజీ సర్పంచ్ ఎంబారి విఠల్ కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్య భద్రతకు, ఆర్థిక సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాములుకు సహాయం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డికి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు