బి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు
18-09-2026 | 05:51pm
బోథ్ సెప్టెంబర్ 18 ( విజయక్రాంతి) మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు పుండ్రు రాకేష్ రెడ్డితోపాటు రోహిత్ మరికొంతమంది యువకులు హైదరాబాదులో కేటీఆర్ సమక్షంలో స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ (Local MLA Jadav Anil) ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ కెసిఆర్ నాయకత్వంలో (Leadership of KTR and KCR) టిఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని అంతేగాక గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే విధంగా కృషి చేశారన్నారు. అందుకే టిఆర్ఎస్ పార్టీలో (TRS Party)యువకులు ముత్యం ,సురేష్ షబ్బీర్ ,చిన్ను క్రాంతి ,శ్రావణ్, రాహుల్, సతీష్ లతోపాటు యువకులు చేరారని పేర్కొన్నారు.