రైతుసంఘం జాతీయ మహాసభలకు సహకరించండి

18-09-2026 | 08:32pm

జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి...

దామరచర్ల :సెప్టెంబర్ :18 నవంబర్ 15వ తేదీ నుండి 18 వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ రైతు సంఘం (National Farmers' Union) మహాసభలను విజయవంతం చేయాలని  నల్లగొండ జిల్లా దామరచర్ల (Damaracharla) మండల కేంద్రం పాటు వాడపల్లిలో  రైతు సంఘం జాతీయ నాయకులు (National leaders of the farmers' association) జూలకంటిరంగారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ఇందుకు గాను రైతాంగం పెద్దఎత్తున ఆర్థికసాయం అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు.

మహాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి రైతు ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో రైతులు పడే ఇబ్బందులను చర్చిస్తామని, వాటికి పరిష్కార మార్గాలను రూపొందిస్తూ అనేక ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో నవంబర్15వ తేదీన భారీ బహిరంగ సభ ను నిర్వహించనున్నట్లు చెప్పారు  , అందులో రైతులే కాక మధ్యతరగతి ప్రజలు రైతుకూలీలు, ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటారన్నారు.

రైతుల సమస్యలతో పాటు కౌలురైతుల గురించి చర్చించి వారికి న్యాయం జరిగే చట్టాల కోసం మహాసభ నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలకు,పాలకులకు రైతులు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు డబ్బికార్ మల్లేష్,రైతుసంఘం మండల అధ్యక్షులు మాలోతు వినోద్ నాయక్, సీఐటీయూ నాయకులు దయానంద్, సీపీఐ(ఎం) వాడపల్లి నాయకులు ఖాజామోయినుద్దీన్‌, రవి, పిచ్చయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు