సాంస్కృతిక కార్యక్రమాలు వల్ల విద్యార్థులలో సృజనశీలత

18-09-2026 | 07:31pm

మండల విద్యాశాఖ అధికారి జివివి సత్యనారాయణ.

వెంకటాపురం (నూగూరు)/ సెప్టెంబర్ 18/ (విజయక్రాంతి): చారిత్రక వారసత్వ సంపాదలైన రామప్ప, కోటగుళ్ళు వంటి అంశాలపైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో సృజన శీలత పెంపొందుతుందని ఎంఈవో జి. వి. వి.సత్యనారాయణ(MEO Satyanarayana) ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు శ్రీ కోగిల విజయకుమార్లు అన్నారు.

గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానా చార్యులు శ్రీ కోగిల విజయకుమార్ అధ్యక్షతన యువ టూరిజం కార్యక్రమంలో భాగంగా ఇంటర్మిడియేట్ విద్యార్థులకు పర్యాటక ప్రాధాన్యత అనే అంశంపై నృత్యం,రీల్స్, స్కిట్స్, పాటలు, ఫుడ్ ఫెస్టివల్ వంటి విభాగాలలో పోటీలు నిర్వహించారు.

కాగా పై విభాగాలలో సత్తాచాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన విజయకుమార్, సత్యనారాయణలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి అంశాలపై పోటీ నిర్వహించడం వలన విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందుతుందని అన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటి మండలానికి మంచి పేరును తీసుకురావాలని కోరారు. 

మరిన్ని వార్తలు