గణపయ్య మండపం వద్ద అన్నప్రసాద వితరణ

18-09-2026 | 07:57pm

పాపన్నపేట,సెప్టెంబర్18: మండల కేంద్రం పాపన్నపేటలోని రాణీ శంకరమ్మ యూత్ (Rani Shankaramma Youth)  ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన  మండపంలో కొలువు దీరిన గణపయ్యకు అర్చకులు దిగంబర శర్మ విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం కైలాష్, ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. యూత్ సభ్యులు సాయి కిరణ్ గౌడ్, భాస్కర్, గంగాధర్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, శేఖర్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు