లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

18-09-2026 | 06:15pm

గంభీరావుపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని షాదీఖానాలో ప్రభుత్వ అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ -నర్సాగౌడ్, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతి రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు